BREAKING NEWS

Interviews

EVENTS

Photoshoot

Monday, 21 May 2012

25lakhs paid for gabbarsingh title its too costly

'గబ్బర్ సింగ్' టైటిల్ ఖరీదు తెలుసా?

 'గబ్బర్ సింగ్' పేరు విన్నవారంతా భలే పవర్ ఫుల్ టైటిల్ అని అనుకోవడం సహజం. అయితే ఇది పవర్ ఫుల్ టైటిల్ గానే కాదు ... ఖరీదైన టైటిల్ గా కూడా రికార్డుకెక్కింది. 'గబ్బర్ సింగ్' అనేది 'షోలే' సినిమాలో అమ్జాద్ ఖాన్ పోషించిన పాత్ర పేరు. ఈ సినిమా విజయంలో ఈ కేరక్టర్ కీలకమైన పాత్ర పోషించింది. అందువల్ల ఆ కేరక్టర్ పేరును తెలుగు సినిమా టైటిల్ గా వాడుకోవడం పట్ల 'షోలే' సినిమా నిర్మాతలు అభ్యంతరాన్ని తెలియజేశారట.
       ఈ విషయమై నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ, 'షోలే' సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించిన రోహన్ సిప్పీ ఫ్యామిలీ 'గబ్బర్ సింగ్' టైటిల్ పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అయితే, అప్పటికే ఈ టైటిల్ జనంలోకి వెళ్లి పాప్యులర్ కావడంతో మార్చే ఉద్దేశం లేక, రోహన్ సిప్పీ ఫ్యామిలీకి 25 లక్షలు చెల్లించి, నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాం' అని అన్నారు. ఆ రకంగా 'గబ్బర్ సింగ్' ఖరీదైన టైటిల్ విభాగంలో కూడా తన పేరు నమోదు చేసుకుందన్న మాట! 
 
Copyright © 2013 Telugucinemas.in,Telugucinemas.Net is Now Telugucinemas.in,www.telugucinemas.in
Share on Blogger Template Free Download. Powered byBlogger