రాఘవేంద్రరావు పరిచయం చేస్తున్న హీరో!
తెలుగు సినిమాదర్శకులలో రాఘవేంద్ర రావు కి ఓ ప్రత్యేక స్థానం వుంది ప్రస్తుతం నాగార్జునతో 'శిరిడీ సాయి' చిత్రాన్ని రూపొందిస్తున్న సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, త్వరలో ఓ కొత్త హీరోని తెలుగు తెరకు పరిచయం చేయనున్నారు. ఇటీవల 'శ్రీరామ రాజ్యం' చిత్రాన్ని నిర్మించిన యలమంచిలి సాయిబాబు తనయుడు రేవంత్ హీరోగా నటించే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. 'ఇంటింటి అన్నమయ్య' పేరుతో రూపొందే ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తారు. ఈ చిత్రాన్ని ఓ భారీ చిత్రంగా నిర్మించడానికి నిర్మాత సాయిబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గతం లో నాగార్జున తో చేద్దాం అని అనుకున్నారు రాఘవేంద్ర రావు తెలుగు తెరకు పరిచయం చేసిన హీరో ల లో వెంకటేష్, అల్లు అర్జున్ వంటి వారు వున్నారు ఈ దర్శకుడు ఈ మధ్యనే 70 వ వసంతోకి అడుగు పెట్టారు ఈ దర్శకుడికి హీరో కి TELUGUCINEMAS.NET శుభాకాంక్షలు అందిస్తోంది |