BREAKING NEWS

Interviews

EVENTS

Photoshoot

Monday, 24 December 2012

Tanikella Bharani Artical On Delhi Gang Rape Issue -TeluguCinemas.in




బస్... బహుత్ హోగయా!
---------------------------

నేనే అర్ధరాత్రి... దేశరాజధానిలో... సఫ్దర్‌జంగ్ మార్గంలో వెళ్లడానికి... టైర్లు గింజుకుంటుంటే...
నా వెర్రితల్లీ!.. నువ్వెల్లా ఎక్కావే...
ఎంతమంది వృద్ధ మాతల్ని మోశాను...
ఎంతమంది బాలింతల్ని మోశాను...
ఎంతమంది పాపల్ని మోశాను...
ఎంతమంది కన్నె పిల్లల అల్లరి చూశాను..
కానీ ఆరోజు రాత్రి... మీ ఇద్దరూ కూర్చున్నప్పుడు... నాకు ముచ్చటేసింది... అంచేతే...
కుదుపులు లేకుండా మెల్లిగా పూలరథంలా వెళ్లాలనుకున్నాను...
కానీ ఈ కీచక ‘లం...’...
ఖర్మ కాకపోతే... వాళ్లని తల్లివైపు నుంచే తిట్టాల్సి వస్తోంది...!
... ఆ ఘోరం జరుగుతున్నప్పుడు..
నా టైర్లు పేలిపోతే బావుండుననుకున్నాను!
బ్రేకులు ఫెయిలయితే బావుండుననుకున్నాను!
హెడ్‌లైట్లు బద్దలైపోతే బాగుండుననుకున్నాను!
నా హారను హోరులో నీ రోదనను కలిపేశాను తల్లీ!
నా సీట్లు రక్తమోడాయ్! నా స్టీరింగ్ మెలికలు తిరిగింది!
ఛీ... ఇది.. భా...‘రతి’ దేశమై పోయిందేంటి తల్లీ!
... ఇక్కడ ఘోరాలు ఆపే ఒక్క మగ ‘లం...’ (చూశావా మళ్లీ) లేడేంటి చెల్లీ..!
... నిజంగా కోరుకోకూడదు కానీ! ఒక్క మంత్రి కూతురుకిట్లాంటిది జరిగుంటే!...
అప్పుడేమైనా చట్టానికి చీమ కుట్టేదేమో!!
ఇంత నపుంసక జాతీ...!
అర్ధరాత్రి ఆడపిల్లని చూసేసరికి... అంగ.. అనంగ... రంగమైపోతుందేమిటీ!
ఈ కీచక పంచకానికి... నేను కోరుకునేది... శిరచ్ఛేదం... లేదా అంగ ఖండనం!
లేదూ...

ఆడపిల్లల పిండాలన్నీ.. హిందూ మహాసముద్రంలో తీసి పారేయండి...
ఆడాళ్లందరూ... మొదటి మహిళల దగ్గర్నించీ...
అన్నట్టు... ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ‘శీలం’దీక్షితామణి దగ్గర్నుంచి...
పరాయిదేశం పారిపొండి!!
ఇంక... ఈ భారద్దేశంలో... ఆడపిల్లలు పుట్టకూడదు!...
అని శాసనం చేయించండి!
... కానీ ఇవన్నీ చేసేముందు... నా మీద పెట్రోలు పోసి అంటించండి!!
... అలాటి మొగ విధవలందరూ... చలి కాచుకుంటారు!!

ఇట్లు
తగలబడిపోయిన బస్సు

********************************************

ఢిల్లీ బస్సు ఘటనపై మా " తనికెళ్ళ భరణి " గారి అక్షర ఆవేదన.
 
Copyright © 2013 Telugucinemas.in,Telugucinemas.Net is Now Telugucinemas.in,www.telugucinemas.in
Share on Blogger Template Free Download. Powered byBlogger