
ఇప్పటి వరకూ యమలోకం నేపథ్యంలో వచ్చిన సినిమాలకు..ఈ సినిమాకు పోలికే ఉండదు. చూసినవారంతా ఇది కొత్తగా ఉందే అంటారు’’ అన్నారు బూరుగుపల్లి శివరామకృష్ణ. ఆయన శ్రీ వెంకటేశ్వర ఎంట ర్‌టైన్‌మెంట్ పతాకంపెై నిర్మించిన సినిమా ‘దరువు’. ‘సౌండ్ ఆఫ్ మాస్’ అనేది ఉపశీర్షిక. రవితేజ హీరో. తాప్సీ కథానాయిక. శివ దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో పాత్రికేయులతో ముచ్చటిస్తూ బూరుగుపల్లి పెైవిధంగా స్పందిం చారు. మరిన్ని సంగతులు మాట్లాడు తూ -‘‘అవినీతిపెై వేసే దరువు ఇది. సమకాలీన రాజకీయాలను పరిధుల్లో చూపిస్తూ..పూర్తి స్థాయి వినోదంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరో బుల్లెట్‌రాజా ప్రవర్తనకు తగ్గ టైటిల్ ఇది. రవితేజ హీరోయిజం ఎలివేట్ చేస్తుంది. యమలోకం నేపథ్యమూ కథలో ఇమిడి ఉంది. 30ఏళ్ల నుంచి యమ నేపథ్యంలో వచ్చిన సినిమా లకు భిన్నంగా దీనిని తీర్చిదిద్దాం. కథనాన్ని దర్శకుడు చాలా కొత్తగా నడిపించారు. రవితేజ ఐదు విభిన్న వేషాల్లో అలరిస్తాడు.

శివ సహాయ దర్శకుడిగా ఉన్నప్పట్నుంచి ఉన్న పరిచయం వల్ల ఈ సినిమా చేశాం. సెన్సార్ యుఎ సర్టిఫికెట్ ఇచ్చి ప్రశంసించింది’’ అన్నారు. మల్టిపుల్ విషయాలు మాట్లాడు తూ-‘‘టాలీవుడ్ విశేషాలను నిరంతరం బుల్లి తెరపెై వీక్షించేలా ఓ కొత్త చానల్‌ను ‘చిత్రసీమ’ పేరుతో ఏపి ఫిలింఛాంబర్ ప్రారంభించనుంది. 24గం.లు సినిమాపెైనే ప్రసారా లుంటాయి. ఈ ఆగస్టునాటికి అన్నీ సిద్ధం చేస్తాం. అదేగాక ఎన్టీవీతో కలిసి వేరే చానెల్‌ను ఏర్పాటు చేయ నున్నాం’’ అన్నారు. డిజిటల్ సినిమా విషయమై ఛాంబరు కొన్ని నిబం దనలను సడలించాలని అన్నారు. పెద్ద సినిమాలను కాస్ట్ ఫెయిల్యూర్స్ నుంచి
రక్షించడానికి ప్రత్యేక కృషి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.