BREAKING NEWS

Interviews

EVENTS

Photoshoot

Thursday, 24 May 2012

NO RIGHTS FOR PRODUCER COPY RIGHT IS BIG HEADACHE TO PRODUCERS


కాసులు పెట్టే నిర్మాత పై కాపీరైటు పోటు
గతంలో కాపీరైట్‌ చట్టంలో సవరణను వ్యతిరేకిస్తూ తెలుగు నిర్మాతలు ఆందోళనకు దిగారు. వీరిలో కొందరు ఈ అంశంపెై అప్పట్లో నిరాహారదీక్షకు సైతం పూనుకోవడం గమనార్హం. కాపీరెైట్‌ చట్టం అమలుచేస్తే తమ మనుగడకు ప్రమాదం అనేది నిర్మాతల ప్రధాన ఆరోపణ. కాపీరైటుట్‌ చట్టంలో సవరణ చేయడం వల్ల సాంకేతిక నిపుణులు మాత్రమే లబ్ధి పొందుతారు. నిర్మాత మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోతాడు. ఇకపెై తన సినిమాకు సంబంధించి జరిపే ఆర్థిక లావాదేవిల్లో సాంకేతిక నిపుణులకు సైతం నిర్మాత భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. నిజానికి ఒక నిర్మాత తన చిత్రం కోసం ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు దానికి సంబంధించి పారితోషికం చెల్లిస్తాడు. సినిమా పూర్తి కావడంతోటే ఆ ఒప్పందం రద్దవుతుంది. ఆ తర్వాత సినిమాపెై పూర్తి హక్కులు నిర్మాతకే ఉంటాయి. లాభాలు, నష్టాలు అతనే అనుభవిస్తాడు. చాలాకాలంగా అమలులో ఉన్న ఈ పద్ధతికి బ్రేక్‌ వేస్తూ ’క్రియేటివిటీ’అంటూ సినిమాకు జరిగే ఆర్థిక లావాదేవిల్లో తమకు వాటా కావాలంటున్నారు సాంకేతిక నిపుణులు. ముఖ్యంగా సంగీత దర్శకుల నుండి ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంది. తమ క్రియేటివిటీని నిర్మాత నగదుగా మార్చుకుంటున్నాడు కాబట్టి అందులో వాటా కోరడంలో తప్పేమిటని వారి వాదన.కాలర్‌ ట్యూన్స్‌, శాటిలెైట్‌ రెైట్స్‌ ద్వారా ఇటీవల నిర్మాతలకు ఆదాయం బాగా పెరిగింది. కొన్ని చిత్రాలకు ఆడియో అమ్మకాలు ద్వారా కూడా ఆదాయం వస్తోంది. చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించే రచయితలు, దర్శకులు కూడా ఇటువంటి తరహా భాగస్వామ్యాన్ని కోరుతున్నారు.

ఇప్పటికే సినిమా తీయడం అంటే నష్టాలను కోరి తెచ్చిపెట్టుకోవడమే అనే పరిస్థితి ఎదుర్కొనే నిర్మాతకు సినిమా నుంచి వచ్చే ఆదాయంలో ఏమీ మిగలకుండా చేయాలనే వీరి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఉత్తరాదిలో అమీర్‌ఖాన్‌ వంటి హీరోలు నడుం బిగించారు. కర్నాటక చిత్ర పరిశ్రమ కూడా ఇదే బాటలో ఉంది. తెలుగు నిర్మాతలు సైతం దీనిని అడ్డుకోవడం కోసం శ్రమించారు. కాపీరెైట్‌ చట్టంలో సవరణ ప్రకారం నిర్మాతలకు మిగిలేది ఏమీ ఉండదనేది వారి ఆందోళనకు కారణం. ఈ విషయమై మొత్తం పరిశ్రమ అంతా పోరాడగలిగితే ఫలితం ఉంటుంది. దీనికి పరిశ్రమ పెద్దలే నడుం బిగించాలి.

వినోదాన్ని అందించే చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో కేవలం క్యాషియర్‌గా మాత్రమే కొనసాగుతున్న నిర్మాత ముఖంలో చిరునవ్వు కనిపించడం లేదు.పరువు కోసం తిమ్మిని బమ్మిని చేస్తూ ఆడియో విడుదల అయ్యాక ఆడియో అమ్మకాల ద్వారా గోల్డెన్‌ డిస్క్‌లు, ప్లాటినం డిస్క్‌లు సాధిస్తున్నట్లు, సినిమా విడుదలెైన వెంటనే అధిక కలెక్షన్లు వస్తున్నట్లుగా చూపించుకుంటూ, శాటిలెైట్‌ రెైట్స్‌ అమ్మడం ద్వారా కూడా అధిక ఆదాయం వస్తున్నట్లు పెైకి చెబుతూ లోలోపల ధెైర్యం సడలుతున్నా బింకంగా వుంటూ, చిరునవ్వులు పులుముకుంటున్నారు చాలామంది నిర్మాతలు. వీటికి తోడుగా పెైరసీ ధాటికి బెంబేలెెత్తుతున్న సమయంలో సొంత టెక్నీషియన్స్‌ నుండే ఇలా సమస్య తలెత్తడం నిర్మాతల పాలిటి శాపమే!

T.PRASనిర్మాతకు ఇది సంకట పరిస్థితి. ఈ కొత్త చట్టం రచయితలు, సంగీతదర్శకులకు వర్తిస్తుంది. వారి వారసులకు కూడా హక్కులు వర్తిస్తాయి. ఇది విదేశీ తరహా చట్టం. హాలీవుడ్‌లో సినిమా సంస్కృతి పూర్తిగా వేరు. సాంకేతిక నిపుణులకు సినిమా లాభాల్లో వాటాలు ఉంటాయక్కడ. నిష్పత్తి అమలవుతుంది. ఇది మన సంస్కృతిలో వర్తించదు. ఎందుకంటే మన నిర్మాత పెద్ద మొత్తంలో మాట్లాడుకుని రెమ్యునరేషన్‌ చెల్లిస్తున్నాడు. తెలుగులో లీడింగులో ఉన్న టెక్నీషియన్లంతా బాగానే గుంజుతున్నారు. కేవలం 2శాతం మాత్రమే విజయాలు దక్కే ఈ పరిశ్రమకు కొత్త సవరణ చట్టం వర్తించదు. విదేశీ చట్టాలు ఇక్కడ అనువర్తించడం దారుణం. దీనిపెై ముంబెైలో ఈ నెల 31న ఫిలింఫెడరేషన్‌ మీటింగ్‌ జరుగనుంది. అక్కడ చాలా విషయాలు చర్చించనున్నాం.
-ప్రసన్నకుమార్‌
(నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి)


సవరించిన కాపీరెైట్‌ యాక్ట్‌ విషయంలో మా గొంతు వినిపించినా..జావెద్‌ అక్తర్‌ లాంటి ప్రముఖుల ముం దు అది కనిపించలేదు. అయితే నాన్‌ అసైన బుల్‌ పరిశ్రమల్లో 3ఏళ్ల పాటు సడలింపు అయినా ఇవ్వ మని అడిగాం. దానికీ వారు అంగీకరించలేదు. దీ నిపెై మరోసారి పరిశీలన జరగాలి. కొత్తగా వచ్చిన నిబంధన ప్రకారం.. సంగీతదర్శకుడు, పాటల రచ యిత, ఆల్బమ్‌కి ఖర్చు చేసే నిర్మాత ఈ ముగ్గురికి షేరింగ్‌ వర్తిస్తుంది. ఆలోచన, సృజన కంటే ఇక్కడ డబ్బు పెట్టడం ఎక్కువ రిస్క్‌ కాబట్టి...నిర్మాత వెైపు ఆలోచించాలి. కొత్తగా వచ్చిన నిబంధన వల్ల వాటా ఇవ్వాల్సి వచ్చి నప్పుడు..సదరు సృజనశీలికి రెమ్యు నరేషన్‌ కొంత తగ్గుతుంది. షేరింగుతో ముడిపెట్టి రెమ్యునరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. సక్సెస్‌, డిమాండ్‌-సప్లై ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి.

-బూరుగుపల్లి శివరామకృష్ణ
(నిర్మాతల మండలి అధ్యక్షుడు)


shoba90శాతం ఫ్లాపులు వస్తున్న మన పరిశ్రమకి ఇది పూర్తి విరుద్ధ చట్టం. నిర్మాతను లాభా ల్లో వాటా అడిగినట్టే, నష్టాల్లో సాయం చేయడానికి సృజకుడు ముందుకొస్తాడా? ప్రతి దానికీ నిర్మాతే బాధ్యుడు. రిలీజయ్యాకే సినిమా హిట్టో, ఫట్టో తేలేది. అంతవరకూ ఖర్చు లన్నీ నిర్మాతవే. అందుకే ముందుగా ఓ ఫిక్స్‌డ్‌ రెమ్యునరేషన్‌ని ఇక్కడ మాట్లాడుకుం టున్నారు. ఒకవేళ రచయిత లేదా సంగీతదర్శకుడు తమ ప్రొడక్ట్‌పెై మరీ నమ్మకం ఉంటే ముందే నిర్మాతతో అన్నీ మాట్లాడాలి. ఇది తెలుగు భాష వరకే. వేరే భాషల్లో తర్జూమా, రీమేకు చేస్తే అదనపు మొత్తం చెల్లించాలి...ఇలా అన్నిటినీ స్పష్టంగా మాట్లాడుకోవాలి. అప్పుడు ఆయా నిర్మాతకు, సృజకులకు ఇద్దరికీ నష్టమేమీ ఉండదు కదా! కొత్తవారికి అవకాశం ఇచ్చేది నిర్మాత రిస్కు తీసుకునే కదా! ఇవన్నీ ఆలోచించాలి చట్టం చేసేవాళ్లు.

-నిర్మాత శోభ
(ఎస్వీఅర్‌ మీడియా)


ఎన్నో కష్టనష్టాలకోర్చి తనకున్న కొద్దిపాటి ఆస్తులు అమ్ముకుని...రిస్క్‌చేసి సినిమాను తీసే నిర్మాత నాలుగు కాలాల పాటు పచ్చగా ఉంటేనే ఇండస్ట్రీ కూడా కళకళలాడుతుంది. ఒక నిర్మాత ఒక చిత్రాన్ని నిర్మించి విడుదల చేయడానికి కనీసం ఒక సంవత్సరకాలం పడుతోంది. ఈ సంవత్సర కాలంలో నిర్మాతకు తమ రచనలను, పాటలను, సంగీతాన్ని అమ్ముకుంటున్న కళాకారులు దాదాపు ఆరడజను సినిమాలకు పనిచేసి నాలుగు డబ్బులు సంపాదిం చుకుంటున్నారు. కేవలం ప్రతి సంవత్సరం 5 శాతం నిర్మాతలే లబ్ధిపొందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మాతలకు ఈ కాపీరెైటు చట్టం ‘గోరుచుట్టుపెై రోకలిపోటు’లా తయారవుతుంది.

-కూనిరెడ్డి శ్రీనివాస్‌
ప్రణతి క్రియేషన్స్‌
SOURCE SURYA
 
Copyright © 2013 Telugucinemas.in,Telugucinemas.Net is Now Telugucinemas.in,www.telugucinemas.in
Share on Blogger Template Free Download. Powered byBlogger